Monday, December 23, 2024

పంజాబ్ ఎన్నికల్లో ధన ప్రవాహం

- Advertisement -
- Advertisement -

More Money expenditure in Punjab Elections

చండీగఢ్ : పంజాబ్ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతుండగా, మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిన తరువాత ఈ నెల 18 వరకు రూ.46.66 కోట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.2 కోట్ల విలువైన 6.60 లక్షల లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్టు సీఈవో డీఆర్ ఎస్ కరుణరాజు తెలిపారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ రూ. 44.49 కోట్ల సైకోట్రాఫిక్ పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాయని లెక్కల్లోకి రాని రూ.16 లక్షల నగదును జప్తు చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,90,275 లైసెన్స్‌డ్ ఆయుధాలు ఉండగా, ఇందులో 91.10 శాతం డిపాజిట్ అయ్యాయని పేర్కొన్నారు. లైసెన్సు లేకుండా ఉన్న 27 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News