Monday, December 23, 2024

రాష్ట్ర జల వనరుల సంస్థకూ కేంద్రం జయహో

- Advertisement -
- Advertisement -

A grade To the State Water Resources Corporation

ఏ గ్రేడ్ ఇచ్చిన కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వరుస ప్రశంసలు

మనతెలంగాణ/హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ (ఆర్‌ఇసి)నుంచి ఎ ప్లస్ కేటగిరి గుర్తింపు లభించింది. సంస్థ పనితీరు , ఆర్ధిక లావాదేవీల ఆధారంగా ఈ గుర్తింపు దక్కింది. రెండు రోజుల కిందటే కాళేశ్వరం కార్పేరేషన్‌కు కూడా గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నుంచి ఎ గ్రేడ్ గుర్తింపు లభించిం ది. దీంతో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి గుడ్ విల్ పెరిగిపోయింది.రాష్ట్ర జల వనరు ల మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థను తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం 2018 లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి పారుదల ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలన్న లక్షంతో ఈ సంస్థను ఏర్పాటు చేసింది.

గోదావరి నది పరివాహకంగా సీతారామ ఎత్తిపోతల పథకం, దేవాదుల, కాంతానపల్లి ఎత్తిపోతల పథకాలు , గోదావరి వరద కాలువ ప్రాజెక్టులను పూర్తి చేసేందకు అవసరమైన నిధుల సమీకరణ బాధ్యతలను జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పోరేషన్‌చేపట్టింది. ఇందుకోసం యూనియన్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , గ్రామీణ విద్యుదీకరణ సంస్థ , పిఎఫ్‌సి సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆర్ధిక సంస్థలనుంచి నిధులు పొందిన జలవనరుల మౌలిక సదుపాయల ఆభివృద్ధి సంస్థ ఇప్పటికే దేవాదులు ప్రాజెక్టు పనుల్లో 90శాతం పూర్తి చేసింది. కాంతానపల్లి ఎత్తిపోతల పధకంలో 99శాతం పనులు పూర్తయ్యాయి.వదరకాలువ పనుల్లో కూడా 90శాతం పనులు పూర్తయ్యాయి. సీతారామ ఎత్తిపోతల పథకంలో కూడా ఇప్పటికే50శాతం పనులు పూర్తికాగా , మిగిలిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.

తెలంగాణకు పెరిగిన గుడ్ విల్

కేంద్ర ప్రభుత్వ రంగసంస్థగా ఉన్న ఢిలీలోని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఇసి) నుంచి రాష్ట్రానికి చెందిన జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ది కార్పోరేషన్‌కు , కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఎ ప్లస్ , ఏ గ్రేడ్ గుర్తిపులు లభించటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక సంస్థల్లో గుడ్ విల్ మరింతగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ ఆర్‌ఇసి దేశవాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల పనితీరు , వాటి నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడింగ్‌లు ఇస్తూ ఉంటుంది.ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం అర్ధిక సంస్థలనుంచి సేకరించిన నిధులు ,వాటి వినియోగం, చేపట్టిన ప్రాజెక్టులను సమర్ధవంతంగా పూర్తి చేయటం, వాటి ద్వారా సాధించిన ఫలితాలు , ఆర్దిక సంస్థలకు సకాలంలో కంతులు చెల్లించటం, క్రమం తప్పకుండా చెల్లించటం, ప్రాజెక్టులను ఆడిటింగ్ చేయిచటం తదితర అంశాలన్నింటినీ ఆర్‌ఇసి లోతుగా అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో అన్ని సక్రమంగా ఉన్నట్టు సంతృప్తి చెందాకే వాటికి ఎ ప్లస్ , ఏ, బి , సి గ్రేడ్లను ప్రకటిస్తుంది. ఆర్‌ఇసి ఏకంగా రాష్ట్రంలోని రెండు సంస్థలకు గ్రేడ్లు ప్రకటించటంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ఖ్యాతీ జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News