Friday, December 20, 2024

‘మేజర్’ వాయిదా..

- Advertisement -
- Advertisement -

అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ను వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడం లేదని మేకర్లు తెలిపారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యాన్ని, యవ్వనాన్ని, ముంబయ్ దాడులు, మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలన్నీ చూపించబోతున్నారు. మహేష్‌బాబు జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

‘Major’ Movie Release date postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News