గుదిబండి వెంకట సాంబి రెడ్డి నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్ బ్యానర్‌పై తొలిసారిగా అలీ హీరోగా ‘పండుగాడి ఫొటోస్టూడియో’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత మలయాళంలో రూపొందిన ‘పడి నెట్టం పడి’ చిత్రాన్ని ‘గ్యాంగ్స్ ఆఫ్ 18’ పేరుతో తెలుగులోకి అనువదించారు. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వంలో మమ్ముట్టి, ప్రియమణి, ఆర్య, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఈనెల 26న తెలుగులో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గుదిబండి వెంకట సాంబిరెడ్డి మాట్లాడుతూ.. “విద్యార్థి దశ గురించి ఈ చిత్రంలో దర్శకుడు చాలా చక్కగా చూపించారు. విద్యార్థులకు సరైన గురువు దొరికితే వాళ్ల జీవితం ఎలా మారుతుంది… అనే చక్కటి సందేశం ఈ సినిమాలో ఉంటుంది. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంత్రితో పందెం కట్టటం, ఆ విద్యార్థులు ఈ పందెంలో ఎలా నెగ్గారనేది ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా చూపించారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు మలిచిన తీరు అత్యద్భుతం. ఇక ఆచార్యుని పాత్రలో మమ్ముట్టి అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రియమణి, ఆర్య, పృధ్వీరాజ్ నటన హైలెట్‌గా నిలుస్తాయి”అని తెలిపారు.
‘Gang of 18’ Movie to release on Jan 26th