Monday, December 23, 2024

వచ్చేది మా ప్రభుత్వమే .. అప్పుడు బదులు తీర్చుకుంటాం : ఎస్పీ

- Advertisement -
- Advertisement -

లక్నో: యూపీలో తమ పార్టీ గెలుస్తుందని, తమ ప్రభుత్వం కొలువు దీరగానే తమను అణచివేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఎస్పీ ముస్లిం అభ్యర్థి అదిల్ చౌదరీ చెబుతున్న వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమను వేధించే ముందు వారు వందసార్లు ఆలోచించుకోవాలని ఈ వీడియోలో ఆయన కాషాయ పార్టీ నేతలను హెచ్చరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నామని ఎస్పీ ఎమ్‌ఎల్‌ఎ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అదిల్ చౌదరీని ఎస్పీ మీరట్ సౌత్ నుంచి బరిలోకి దింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News