- Advertisement -
కొలంబో: శ్రీలంక ప్రాదేశిక జలాలలో అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు నిర్బంధించిన 56 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని శ్రీలంక కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. మన్నార్ సముద్రంలో శ్రీలంక నౌకాదళం గత ఏడాది డిసెంబర్ నెల మధ్యలో అదుపులోకి తీసుకున్న భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని జాఫ్నాలోని కోర్టు ఆదేశాలు జారీచేసింది. 56 మంది భారతీయ మత్సకారులను విడుదలకు కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆనందంగా ఉందంటూ కొలంబోలోని భారతీయ హైకమిషన్ ట్వీట్ చేసింది. భారతీయ మత్సకారుల విడుదలకు హైకమిషనర్ గోపాల్ బగ్లే, ఆయన బృందం చేసిన కృషిని అభినందిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మరో ట్వీట్ చేశారు.
- Advertisement -