ఫైజర్ కంపెనీ అధ్యయనం
న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తాము తయారుచేసిన కొవిడ్- 19 వ్యాక్సిన్‌కు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఫైజర్ కంపెనీ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. తన భాగస్వామి బయోఎన్‌టెక్‌తో కలసి ఈ అధ్యయనాన్ని ప్రారంభించినట్లు ఫైజర్ మంగళవారం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించిన పక్షంలో ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే విధంగా తమ కొవిడ్- 19 వ్యాక్సిన్‌ను మెరుగుపరిచేందుకు ఫైజర్ చర్యలు తీసుకుంటోంది. ఇతర వేరియంట్లతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైతం ఒమిక్రాన్ వేరియంట్ సోకే అవకాశం హెచ్చుగా ఉండడంతో ప్రస్తుత వ్యాక్సిన్‌లో మార్పులు అవసరమా కాదా అన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు తీవ్ర అస్వస్థత, మరణం నుంచి రక్షణ కల్పిస్తున్నప్పటికీ బూస్టర్ డోసును ఇవ్వడం వల్ల వైరస్ నుంచి రక్షణ మరింతగా లభించే అవకాశం ఉన్నట్లు అమెరికా, తదితర దేశాలలో జరుగుతున్న అధ్యయనాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్‌ను తట్టుకునే సామర్ధంగల కొత్త వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా ఇవ్వడం భవిష్యత్తులో ఒమిక్రాన్‌తోపాటు ఇతర కొత్త వేరియంట్లను సమర్థంగా ఎదుర్కోవచ్చని ఫైజర్ వ్యాక్సిన్ రిసెర్చ్ చీఫ్ కాథ్రిన్ జాన్సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.