హైదరాబాద్ : రాష్ట్రంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు రెండో ఆన్‌లైన్ తరగుతులు కొనసాగాయి. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దూరదర్శన్, టీ సాట్ ఛానళ్ల ద్వారా టివి పాఠాలు బోధించారు. రెండవ రోజు 63.38 శాతం విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్రంలోని 5,640 ఉన్నత పాఠశాలల్లో 7,19,385 మంది విద్యార్థులు చదువుతుండగా, మంగళవారం 3,07,154 (42.70 శాతం) మంది విద్యార్థులలు టివిల ద్వారా ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాగా, 1,31,130 మంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ద్వారా హాజరైనట్లు అధికారులు తెలిపారు. రెండవ రోజు 29,392 మంది ఉపాధ్యాయులు, ప్రధానోధ్యాయులు ఫోన్ల ద్వారా విద్యార్థులను పర్యవేక్షించగా, 9,272 మంది టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 36,440(5.7శాతం) మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు వీక్షించేందుకు టివిలు, ఫోన్లు వంటి సౌకర్యాలు లేవని గుర్తించి, వారిని ఇతర విద్యార్థులతో కలిసి పాఠాలు వినేలా, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేశారు.
రెండో రోజు ఆన్‌లైన్ క్లాసులకు 63.38 శాతం విద్యార్థులు హాజరు
- Advertisement -
- Advertisement -
- Advertisement -