- Advertisement -
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ క్యూ3 ఫలితాల్లో నిరాశపర్చింది. డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం రూ.1,011 కోట్లతో 48 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,941 కోట్లుగా ఉంది. కంపెనీ లాభం క్యూ2లో రూ.475 కోట్లు నమోదు చేసింది. ఆదాయం రూ.23,458 కోట్ల నుంచి రూ.23,246 కోట్లకు అంటే 1 శాతం పడిపోయింది. కంపెనీ సేల్స్ కూడా 4,95,897 యూనిట్ల నుంచి 4,30,668 యూనిట్లకు అంటే 13 శాతం తగ్గాయి. సెమికండక్టర్ చిప్‌ల కొరత, ఇతర పరికరాల సరఫరాలో ప్రపంచవ్యాప్తంగా కొరత నెలకొనడం వల్ల కంపెనీపై ప్రభావం ఏర్పడింది. వీటి కొరత వల్ల 90 వేల వాహనాల ఉత్పత్తి తగ్గించాల్సి వచ్చిందని సంస్థ ప్రకటించింది.
- Advertisement -