Saturday, December 21, 2024

ఆ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

Opportunities should be given in Pan India movie:Rakul

 

టాలీవుడ్ స్టార్ హీరోల్లో దాదాపు అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా నటిస్తోంది. హిందీలో ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా హిట్ కాకున్నా కూడా వరుసగా అక్కడ చిన్నా చితకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈఅమ్మడు తెలుగులో పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. రకుల్ నటించిన సినిమాలు ఈ ఏడాదిలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉన్నాయి. కానీ కొత్తగా ఈ అమ్మడికి ఆఫర్లు మాత్రం చిక్కడం లేదు. గత ఏడాది చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు మాత్రం ఆఫర్లు లేక ఎదురు చూస్తున్నట్లుగా తెలిసింది. తాజాగా రకుల్ మాట్లాడుతూ “నేను తెలుగుతో పాటు తమిళం, హిందీలో మాట్లాడగలను.. పలు భాషల్లో నటించిన అనుభవం ఉంది.

కనుక నాకు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలి”అంటూ విజ్ఞప్తి చేసింది. హీరోయిన్స్ ఇలా అవకాశాలు ఇవ్వమంటూ విజ్ఞప్తి చేయడం కెరీర్ ఆరంభంలో చూస్తూ ఉంటాం. కాని రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఆరంభించి దాదాపుగా పదేళ్లు కావస్తుంది. ఈ సమయంలో రకుల్ అవకాశాల కోసం ఇలా విజ్ఞప్తి చేయడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అది కాకుండా ఈ భామ తనకు పాన్ ఇండియా సినిమా ఛాన్స్‌లు కావాలంటూ కోరడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News