Tuesday, January 21, 2025

అమెరికా వెళ్తూ ఆరుగురు భారతీయులు అదృశ్యం

- Advertisement -
- Advertisement -
Six from Gujarat on way to US abducted in Turkey
ఇస్తాంబుల్ లోని భారత్ ఎంబసీ అప్రమత్తం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం

న్యూఢిల్లీ : టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఆరుగురు భారతీయులు అదృశ్యమైన సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇస్తాంబుల్ లోని భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే ఈ విషయంపై దృష్టి సారించగా, ఇక్కడి పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. గుజరాత్ లోని కలోల్ తాలూకాకు చెందిన తేజస్ పటేల్ కొద్ది రోజుల క్రితం తన భార్య అల్క పటేల్, కొడుకు దివ్య పటేల్‌తో కలిసి, అమెరికాకు బయలుదేరారు. సరిగ్గా అదే సమయంలో మరో కుటుంబం సురేష్ పటేల్ తన భార్య శోభ, కూతురు ఫోరమ్ కలిసి అమెరికాకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. టర్కీ మీదుగా అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు ఇస్తాంబుల్ చేరుకున్నాయి. అయితే తాజాగా వీరితో వాళ్ల కుటుంబ సభ్యులకు కమ్యూనికేషన్ కట్ అయింది. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఇస్తాంబుల్ లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు.

దీంతో ఎంబసీ అధికారులు అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా వెళ్లే క్రమంలో ఈ రెండు కుటుంబాలు ఇస్తాంబుల్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? చట్ట విరుద్ధంగాఅమెరికా వెళ్లేందుకు ఇస్తాంబుల్‌కు వీరు చేరుకున్నారా ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా విదేశీయులను అక్రమంగా అమెరికాకు తరలించే ముఠానే వీళ్లని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుజరాత్‌కు చెందిన కుటుంబం రక్తం గడ్డకట్టే చలిలో కెనడా నుంచి అమెరికా లోకి అక్రమంగా ప్రవేశిస్తూ ప్రాణాలు విడిచిపెట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పుడు దీనిపై అనుమానాలు కలుగుతున్నాయి. తేజస్ పటేల్, సురేష్ పటేల్‌లు కూఏడా తమ కుటుంబాలతో కలిసి అమెరికా లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి ఉంటారని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే తేజస్ పటేల్, సురేష్ పటేల్ ఏ గ్రామానికి చెందిన వారనే విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News