- Advertisement -
తిరుమల/ఈరోజు వార్తలు: శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన కోటాను ఈనెల 28, 29 తేదీల్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 28వ తేదీ ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, 29వ తేదీ ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టోకెన్ల కోటాను ఆన్‌లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. tirupatibalaji.ap.gov.in ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తప్పకుండా కోవిడ్ వ్యాక్సినేషన్, నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని టిటిడి కోరింది.
Tirumala Srivari darshan tokens in Online on Feb 28
- Advertisement -