Monday, March 31, 2025

బిజెపికి ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎల రాంరాం

- Advertisement -
- Advertisement -

MLA Rajkumar Thukral has resigned from BJP

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమం లోనే గురువారం మరో ఇద్దరు బీజేపీ ఎమ్‌ఎల్‌ఏ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెహ్రీ , రుద్రపూర్ ఎమ్‌ఎల్‌ఎలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా,తెహ్రీ ఎమ్‌ఎల్‌ఎ థన్‌సింగ్ వేగి కాంగ్రెస్‌లో చేరారు. రుద్రపూర్ నుంచి టికెట్ కేటాయించేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన రాజ్‌కుమార్ తుక్రాల్ పార్టీకి రాజీనామా చేసి లేఖను పార్టీ అధ్యక్షుడు మదన్ కౌశిక్‌కు పంపారు. తనకు టికెట్ దక్కకుండా కుట్ర పన్నారని, ఆరోపించిన ఆయన, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. రుద్రపూర్ స్థానం టికెట్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివ్ అరోరాకు ఆ పార్టీ బుధవారం కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News