- Advertisement -
హైదరాబాద్: రాష్ట్ర స్థాయి పోలీస్, ఆబ్కారీ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో పోలీస్, ఆబ్కారీ సదస్సు కొనసాగుతోంది. సదస్సులో మంత్రులు, పోలీసు, ఆబ్కారీశాఖల అధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణపై సిఎం కెసిఆర్ సమీక్షిస్తున్నారు. డ్రగ్స్ కట్టడిపై అధికారులకు సిఎం దిశానిర్దేశం చేయనున్నారు.
- Advertisement -