ఆటోనగర్ వద్ద ఉదయం 5 గంటలకు
టిఎస్‌ఎండిసి సిబ్బందితో కలిసి ఇసుక లారీలను చెక్ చేసిన
టిఎస్‌ఎండిసి చైర్మన్
ప్రభుత్వ నిబంధనలను లోబడి ఇసుకను తరలించాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని టిఎస్‌ఎండిసి చైర్మన్ మన్నె క్రిశాంక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు టిఎస్‌ఎండిసి సిబ్బందితో కలిసి హైదరాబాద్ నగర శివారులో హయత్‌నగర్ వద్ద ఉన్న ఆటోనగర్‌లో వే బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీలను ఆయన చెక్‌చేశారు. ఈసందర్భంగా ఆయన ఆయా లారీ డ్రైవర్‌లకు వే బిల్లులు లేకుండా ఇసుకను తీసుకురావద్దని సూచించారు. మరోసారి ఇలా పట్టుబడితే తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను లోబడి లారీల్లో ఇసుకను తీసుకురావాలని నిబంధనలు అతిక్రమిస్తే కేసులు బుక్ చేస్తామన్నారు. అనంతరం అక్కడ ఉన్న లారీ డ్రైవర్లతో చైర్మన్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిఎస్‌ఎండిసి సంస్థ తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం, నగర శివార్లలో డంప్‌యార్డు విధానం బాగుందని లారీడ్రైవర్లు చైర్మన్‌తో పేర్కొన్నారు.