Monday, November 25, 2024

నేడు నిర్ణయం?

- Advertisement -
- Advertisement -

Today decision on resumption of Educational institutions

విద్యాసంస్థల పునఃప్రారంభమా? సెలవుల పొడిగింపా?

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 31తర్వాత విద్యాసంస్థల పునఃప్రారంభం లేదా సెలవులు పొడిగింపుపై ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించగా, కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో సెలవులను ఈ నెల 30 వరకూ ప్రభుత్వం పొడిగించి, 8,9,10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. సోమవారం నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తారా.? లేక సెలవులను పొడిగిస్తారా.? అనే విషయంపై తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తెరిచినా తలిదండ్రులు విద్యార్థులను పంపించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 8వ తరగతి వరకు మరో వారం పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి, 9,10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిలో ఈ నెల 31 తర్వాత ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.15 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని తరగతులను హాజరయ్యేలా అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఫీవర్ సర్వే ఫలితాలను విశ్లేషించి, కొవిడ్ కేసులు, తీవ్రతను పరిశీలించి శనివారం లేదా ఆదివారం విద్యాసంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News