Monday, December 23, 2024

కన్న కూతురుపై తండ్రి అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Father raped on daughter in chennai

చెన్నై: కన్న కూతురుపై కామాంధుడు లైంగిక దాడికి పాల్పడడంతో అతడిని భార్య హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని ఒట్టేరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 50 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి కేళర నుంచి తమిళనాడుకు వలస వచ్చాడు. నిందితురాలు, భర్త కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు 20 ఏళ్ల కుమార్తె, పదేళ్ల కుమారుడు ఉన్నాడు. కూతురు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే ఉండేది. అమ్మమ్మ వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లడంతో కూతురు తన ఇంటికి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కూతురుపై తండ్రి లైంగికి దాడి చేస్తుండగా ఆమె అరిచింది. అరుపులు విన్న తల్లి లేచి కాపాడడానికి ప్రయత్నించింది. వెంటనే సుత్తెతో అతడి తలపై పలుమార్లు బాదింది. వెంటనే అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News