Monday, December 23, 2024

1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం

- Advertisement -
- Advertisement -

All set for Medaram Jatara

మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం
వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు
మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి
సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన

మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టే మేడా రం గిరిజన జాతరను విజయవంతంగా నిర్వహించేందు కు ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావులు పేర్కొన్నా రు. శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధ్య క్షతన రాష్ట్ర మంత్రులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కు మార్, డిజిపి మహేందర్ రెడ్డిలు హెలికాప్టర్ ద్వారా మే డారం జాతర ఏర్పాట్ల పరి శీలనకు వెళ్లారు. వీరికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పి మ్‌సింగ్ పాటిల్ పుష్పగు చ్ఛంతో స్వాగతం పలికారు. అనంత రం జంపన్నవాగు ప్రాంతాలను పరిశీలించి ప్రభుత్వ సౌకర్యా ల గురించి స్థానిక అధికారులను మంత్రులు అడిగి తెలుసుకు న్నా రు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల ద్వారా ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వారు సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ మేడారానికి వచ్చే ప్రతి సామాన్య భక్తుడికి సమ్మక్క-సారల మ్మ ఆశీస్సులు అందాలన్న దృఢసంకల్పంతో ఉన్నారన్నా రు. అ మ్మవార్ల దర్శనానికి ఫిబ్రవరి 18న వచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చి న తర్వాత మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు గౌర వం దక్కిందన్నారు. నాలుగుసార్లు జరిగిన జాతరకు రూ. 332 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రులు తెలిపారు.

యుద్ధ ప్రాతిపదికన పనులు

జాతర విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి సంకల్పం మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని జాతర ఏర్పాట్లపై జిల్లా పాలనాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 90శాతం పనులు పూర్తి చేశామన్నారు. మి గిలిన పనులన్నీ పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

320 కేంద్రాల్లో 6400 టాయ్‌లెట్స్

గత జాతరలో నాలుగు రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తు లు ముందు గానే దర్శనం నిమిత్తం లక్షల్లో వస్తున్నారని మంత్రులు తెలిపా రు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 320 కేంద్రాల్లో 6400 టాయ్‌లెట్స్ ఏర్పాటు చేశామన్నా రు. జాతర పటిష్ట నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజిం చినట్లు వారు తెలిపారు. 1,100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. 4,000 మందిని పారిశు ద్ధ సిబ్బందిని నియమించామన్నారు.

ఆరోగ్య పరిరక్షణకు 50బెడ్లతో ఆస్పత్రి

వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండేం దుకు 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జెసిబిలు, 20 టాటా ఏస్ వాహనాలు, సేకరించిన చెత్తను డంపు యార్డును తరలించడానికి 70 ట్రాక్టర్లు అందుబా టులో ఉంచామని, భక్తుల సౌకర్యార్థం 200 డస్ట్ బిన్స్ పెట్టామని వారు తెలిపారు. జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 50 బెడ్లతో సమ్మక్క -సారలమ్మ వైద్యశా ల ఏర్పాటు చేసి, అక్కడే ఇంగ్లీష్ మీడి యం స్కూల్లో 6 పడకల వైద్యశాల, మరో 19 మెడికల్ క్యాం పులను ఏ ర్పాటు చేసినట్లు వారు వివరించారు.

అత్యవసర వైద్యం కోసం అంబులెన్సులు

వీటితో పాటు ములుగులో, ఏటూరు నాగారం, పరకాల వద్ద తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖానాలు, తాడ్వాయి దగ్గర 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పస్రా దగ్గర 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామని మం త్రులు తెలిపారు. ఇవీ కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవునా 42 ఆరో గ్య శిబిరాలు, 15 అంబులెన్సులు, 15 బైక్ అంబు లెన్సులు ఏర్పా టు చేశామన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఒక ఐసోలేషన్ షెడ్‌తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏ ర్పాటు చేసినట్టు తెలిపారు.

శానిటైజర్లు, మాస్కుల అందజేత

భక్తుల రవాణా సదుపాయం నిమిత్తం 3,845 బస్సులు అం దుబాటులో ఉన్నాయని, అవి 51 గమ్య స్థానాల నుంచి న డుస్తున్నాయని వారు తెలిపారు. దీనికోసం 50 ఎకరాల్లో బస్‌స్టేషన్ నిర్మించామని, 41 క్యూ లైన్‌లను ఏర్పాటు చేశా మన్నారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సిసి కెమెరాల సర్వేలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,500 మంది ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు శానిటైజ్ చేస్తామని, మాస్క్‌లను అందించనున్నట్టు మంత్రులు తెలిపారు.

భక్తుల విడిదికి భారీ షెడ్లు

జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే వి ధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని మంత్రులు తెలి పారు. జాతరలో నిత్యం వెలుగుల కోసం 4,200 ఎల్‌ఈడి బల్బులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశామన్నారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించామన్నారు. 10,300 మంది పోలీస్ సిబ్బంది, ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు, పశ్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు, టోయింగ్ వాహనాలు, సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏ ర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఎసి బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్నా న్నారు.

మంచి ఫొటో తీస్తే రూ.లక్ష బహుమతి

జాతర సందర్భంగా మంచి ఫొటోలు తీసిన వారిని గుర్తించి లక్ష రూపాయల బహుమతి అందచేయనున్నట్టు వారు తెలిపారు. సమావేశానికి ముందు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించారు. సమీక్షలో ఎంపిలు పసునూరి దయాకర్, మాలోతూ కవిత, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్‌ఎలు గండ్ర వెంకటరమణారెడ్డి, దనసరి అనసూయ, అధికారులు, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News