రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి కెటిఆర్ సూటి ప్రశ్న
చేతనైతే కేంద్రం నుంచి ప్యాకేజీలు
తెచ్చి అభివృద్ధిలో పోటీ పడండి
రాజకీయం అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదు
విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం
పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే
పింఛన్ల కోసం రూ.10వేల కోట్లు
ఖర్చు చేస్తున్నాం హైదరాబాద్‌లోని
పలు నియోజకవర్గాల్లో రూ.371 కోట్ల
అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్
శంకుస్థాపనలు
మన తెలంగాణ/ బాలాపూర్ : మతపరమైన విచ్ఛిన్నకర రాజకీయాలను పక్కనపెట్టి ఏడున్నరేళ్లుగా కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో నేతలు సమాధానం చెప్పాలని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూటిగా రాష్ట్రంలోని బిజెపి నేతలను సూటిగా ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్, బడంగ్‌పేట్ జంట కార్పొరేషన్ల పరిధిల్లో రూ.225.83 కోట్ల నిధులతో నూతనంగా చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిలతో కలిసి శనివారం ఆయన శంకుస్థ్ధాపనలు చేశా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ రాజకీయం అంటే మంత్రుల కాన్వాయ్‌లను అడ్డుకునే విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టడం కాదని, తెలంగాణ ప్రయోజనాలపై ఇక్కడి బిజెపి నాయకులకు ఎం తమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రం నుంచి తక్షణం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల తమతో పోటీపడాలని సవాల్ విసిరారు. గతంలో ఒక్కో మున్సిపాలిటికి అప్పటి ప్రభుత్వా లు రూ.కోటి నిధులు మంజూరు చేస్తేనే పెద్దవిషయంగా ఉండేదని, అలాంటిది మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు కార్పొరేషన్లు, రెండు ప్రత్యేక మున్సిపాలిటీల పరిధిల్లో ఒకేరోజు ఏకంగా రూ. 371.09 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం సంతోషం గా ఉందన్నారు.
పార్టీలు, పదవులకు అతీతంగా రోజుల క్రితం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.400 కో ట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. వచ్చే వారం రోజుల్లో ఇ బ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ. 280 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకా రం చుట్టనున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద గడప లో సంక్షేమం, ఇంటి ముందు అభివృద్ధి చూడాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. చౌక ధరల పంపిణీ వ్యవస్థలో సీలింగ్‌ను ఎత్తివేయడం, రాష్ట్రవ్యా ప్తంగా 950పైచిలకు గురుకులాలు నెలకొల్పి, 5లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, గడచిన ఎనిమిదే ళ్లలో పేద విద్యార్థులకు రూ.16 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెం ట్ చెల్లించడం, అంబేద్కర్, మహాత్మ జ్యో తిరావు ఫూలే ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ ద్వా రా పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రూ.20లక్షలు అందించడం, కెసిఆర్ కిట్లు, షాదీ ముబారక్, కళ్యాణల, రైతుబంధు, రైతుబీమా, మి షన్ భగీరథ, నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్ర భుత్వం కెసిఆర్‌దేనన్నారు. ముఖ్యంగా పింఛన్ల కోసం గత ప్రభుత్వాలు ఏడాదికి రూ.800 కోట్లు మాత్రమే ఖ ర్చుచేసేవని, కెసిఆర్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రూ.10వేల కోట్లు ఖర్చుచేస్తుందన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో రూ.371.09 కోట్లలో.. కేవలం తాగు నీటి కోసమే రూ.212 కోట్లు ఖర్చుచేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటిల్లో మిషన్ భగీరథ రెండో దశ పనుల కోసం ఖర్చు చేయనున్న రూ.1200 కోట్లలో మహేశ్వరం నియోజకవర్గంలో రూ.95కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, యెగ్గె మల్లేషం, మాజీ ఎంఎల్‌ఎ తీగల కృష్ణారెడ్డి, జడ్‌పి చైర్మన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, డిసిసిబి అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, పట్లోళ్ల కౌశిక్ రెడ్డి, బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్ల మేయర్లు చిగురింత పారిజాత నర్సింహ్మా రెడ్డి, ముడావత్ దుర్గ, డిప్యూటి మేయర్లు ఇబ్రాం శేఖర్, తీగల విక్రం రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.