Friday, November 22, 2024

మణిపూర్‌లో వికటించిన పొత్తు.. ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం

- Advertisement -
- Advertisement -

BJP prepares for lone battle in Manipur

 

ఇంఫాల్ : మణిపూర్‌లో నేషనల్ పీపుల్స్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తు వికటించింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్టు బీజేపీ ఆదివారం ప్రకటించింది. నిన్నటివరకు ఎన్‌పీపీతో కలిసి బీజేపీ పోటీ చేయనుందని అనుకున్నప్పటికీ, ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు కొద్ది రోజుల క్రితం ఎన్‌పీపీ అధినేత, మణిపూర్ సీఎం కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. అయితే సగం స్థానాలు కావాలని బీజేపీ పట్టుపట్టినట్టు సమాచారం. నిజానికి కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. కానీ బీజేపీ అధిష్ఠానం సగం సీట్లు కావాలంటూ కోన్రాడ్‌ను కోరగా, ఆయన ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగడానికి బీజేపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 60 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలబెడుతున్మాని, రాష్ట్రంలో 2/౩ వంతు మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News