ఢిల్లీ: ప్రభుత్వ సున్నిత విధానాలతో సామాన్యులకు సులభంగా వైద్య సేవలు అందిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సామాన్యులకు సులభంగా ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఆయుష్మాన్ భారత్ పెట్టుబడులు పేదలకు చికిత్సలో సహాయం చేశాయని ప్రశంసించారు. డిజటల్ ఇండియాకు యుపిఐ విజయవంతమైన ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు. డిజిటల్ చెల్లింపులు అంగీకరిస్తున్నారనేందుకు గొప్ప ఉదాహరణ అని అన్నారు. కరోనాపై పోరాటంలో భాగమైన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అభినందనలు తెలిపారు. కరోనాపై పోరాటంలో పౌరుల ప్రయత్నాలకు అభినందనలు తెలియజేశారు.
కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఏడాదిలోపే 150 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందించిన రికార్డును అధిగమించామన్నారు. అంబేడ్కర్ ఆదర్శాలను మార్గదర్శక సూత్రంగా ప్రభుత్వం పరిగిణిస్తోందని ప్రశంసించారు. యోగా, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యానికి ఆదరణ పెరుగుతోందని ప్రశంసించారు. ప్రతి భారతయుడికి స్వాతంత్య్ర అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మూల సూత్రంతోనే ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను స్మరించుకుంటున్నామని, దేశ సురక్షిత భవిష్యత్ కోసం గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ముఖ్యమన్నారు. గత స్మృతుల నుంచి నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యమని కొనియాడారు. వచ్చే 25 ఏళ్ల పాటు పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.