- Advertisement -
ముంబై : సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు అనుమతించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర దృష్టకరమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలను మద్యం మాన్పించే దిశగా పనిచేయడం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల పేరుతో ప్రజలు మద్యానికి బానిస అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తాను బాధపడినట్టు మీడియాతో సోమవారం అన్నారు. వైన్ మద్యం కాదని, రైతుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఈ నిర్ణయం ఎక్కడికి దారి తీస్తుందని ఆయన ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్లో వైన్ విక్రయాల ద్వారా ఏడాదికి వెయ్యి కోట్ల లీటర్ల అమ్మకాలను లక్షంగా పెట్టుకున్న ప్రభుత్వం వాస్తవానికి ఏమి విస్తరిస్తోందో తెలుసా? అని మండిపడ్డారు.
- Advertisement -