Monday, December 23, 2024

సవాళ్లున్నా.. ‘గాడితప్పలేదు’

- Advertisement -
- Advertisement -

Nirmala Sitharaman introduced Economic Survey 2021-22 in Parliament

కొవిడ్‌ను ఎదుర్కొని నిలబడ్డాం

ప్రైవేటురంగ పెట్టుబడులకు ఊతం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) దేశీయ జిడిపి(స్థూల దేశీ యోత్పత్తి) 8 8.5 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది 2021-22 వృద్ధి అంచనా 9.2శాతం కంటే తక్కువగా ఉం ది. వ్యాక్సిన్ కవరేజ్, సరఫరా విధానం లో సంస్కరణలు వృద్ధికి తోడ్పడతాయని ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా మహమ్మా రి ముందు స్థాయికి కోలుకుంటున్న సం కేతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. సోమవారం నాడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్ల మెంట్‌లో ఆర్థిక సర్వే 2021-22ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ముం దు దేశ ఆర్థిక వ్యవస్థ సర్వే వివరాలను ఆమె సమర్పించారు. కరోనా మహమ్మా రి తీవ్రస్థాయిలో ఉండడం, లాక్‌డౌన్ ఆం క్షలు విధించడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మైనస్ 7.3 శాతానికి క్షీణించింది. మొత్తంగా చూస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో సవాళ్ల ను ఎదుర్కోవడంలో దేశీయ ఆర్థిక వ్యవ స్థ సముచిత స్థానంలో ఉందని స్థూల ఆర్థి క సంకేతాలు సూచిస్తున్నాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్తమ స్థానంలో ఉండ డానికి ప్రధాన కారణం సరైన వ్యూహాన్ని అనుసరించ డమేనని సర్వే వెల్లడించింది. 2020-21 రెండో భా గం నుంచి జిడిపి త్రైమాసిక వృద్ధి నిలకడగా ముందు సాగుతోంది.

కరోనా సెకండ్ వేవ్ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మరింత తీవ్రంగా ప్రభావం చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి రికార్డు స్థాయిలో 9.2 శా తానికి చేరుకుంటుందని అంచనా వేశారు. ఆమె సమర్పించారు. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉండడం, లాక్‌డౌన్ ఆంక్షలు విధించడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మైనస్ 7.3 శాతానికి క్షీణించింది. మొత్తంగా చూస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో సవాళ్లను ఎదుర్కోవడంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ సముచిత స్థానంలో ఉందని స్థూల ఆర్థిక సంకేతాలు సూచిస్తున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉత్తమ స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం సరైన వ్యూహాన్ని అనుసరించడమేనని సర్వే వెల్లడించింది. 2020-21 రెండో భాగం నుంచి జిడిపి త్రైమాసిక వృద్ధి నిలకడగా ముందు సాగుతోంది. 2021 ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో అంతకుముందు లాక్‌డౌన్ ఆంక్షల పరిస్థితికి కంటే ఎక్కువ ప్రభావం ఏర్పడింది. కరోనా సెకండ్ వేవ్ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మరింత తీవ్రంగా ప్రభావం చూపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి రికార్డు స్థాయిలో 9.2 శాతానికి చేరుకుంటుందని అంచనా వేశారు. అయితే వాస్తవ ఆర్థిక వృద్ధి స్థాయి 2019-20 కొవిడ్ ముందస్తు స్థాయిని అధిగమిస్తుందని సంకేతాలిస్తోందని సర్వే పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News