- Advertisement -
అమరావతి: రాష్ట్రంలో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కరోనాతో కారణంగా మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 22,76,370 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, కరోనాతో 14,615మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 21,51,238 మంది బాదితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,05,930 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
AP Reports 6213 new corona cases
- Advertisement -