- Advertisement -
హైదరాబాద్: బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు, బలహీన వర్గాలకు నిరాశే మిగిల్చిందని సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ బడ్జెట్ లో ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగులు,వయో వృద్ధుల భద్రత, సంక్షేమానికి నయా పైస కేటాయింపులు లేవన్నారు.అన్ని వర్గాలకు బిజెపి ప్రభుత్వం వ్యతిరేకమైనదని మరోసారి ప్రపంచానికి తేటతెల్లమైందన్నారు. విభజన హామీలకు సంబంధించిన ఐఐఎం ప్రస్థావన లేదు, గిరిజన యూనివర్సిటీకి కేటాయింపులు లేవు.జిల్లాకొక నవోదయ పాఠశాల మంజూరును ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్ల పట్ల కనీస స్పందన లేకపోవడం తీవ్ర విచారకరం, బాధాకరం, అభ్యంతరకరమని మంత్రి వెల్లడించారు.
- Advertisement -