Monday, December 23, 2024

ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు..

- Advertisement -
- Advertisement -

590 Players to be IPL Auction on Feb 12-13

ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు
తుది జాబితా ప్రకటించిన బిసిసిఐ
ముంబై: బెంగళూరు వేదికగా ఈ నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో మొత్తం 590 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. బెంగళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు ఐపిఎల్ మెగా వేలం పాట జరుగనుంది. ఈ వేలం పాటలో భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా వేలం పాట బరిలో దిగే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ బోర్డు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించిన 228 మంది భారత్, ఇతర దేశాల క్రికెటర్లు ఐపిఎల్ మెగా వేలం బరిలో నిలిచారు. అంతేగాక మరో 355 మంది అన్ క్యాప్‌డ్ క్రికెటర్లు కూడా ఐపిఎల్ ఆక్షన్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది మొత్తం పది జట్లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఉన్న 8 జట్లకు అదనంగా ఈసారి మరో రెండు ఫ్రాంచైజీలు జత కలిశాయి. దీంతో మెగా వేలం పాట అనివార్యమైంది. ఈసారి పలువురు దిగ్గజ క్రికెటర్లు మెగా వేలం పాటకు ప్రతేక ఆకర్షణగా మారారు. వీరిలో ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్‌పై అందరి దృష్టి నిలిచింది. వార్నర్‌ను సొంతం చేసుకునేందుకు వివిధ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి.

మరోవైపు డుప్లెసిస్, కమిన్స్, రబాడ, ట్రెంట్ బౌల్ట్, క్వింటన్ డికాక్, జేసన్ హోల్డర్, బెయిర్‌స్టో, షకిబ్ అల్ హసన్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, కృనాల్ పాండ్య తదితరులు కూడా మెగా వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. వీరిని సొంతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు భారీ మొత్తాన్ని చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ధోని, రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్, శుభ్‌మన్, హార్దిక్, కోహ్లి, రసెల్, నరైన్, పొలార్డ్, రిషబ్, రషీద్, రాహుల్, విలియమ్సన్, మాక్స్‌వెల్, రోహిత్, బుమ్రా, సిరాజ్ తదితరులను ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. కొత్త ఫ్రాంచైజీలు లక్నో రాహుల్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది. ఇక మరో కొత్త జట్టు అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యను సారథిగా ఎంపిక చేసుకుంది. రషీద్, గిల్‌లను కూడా ఈ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. పంజాబ్ జట్టు మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్‌లను మాత్రం అట్టిపెట్టుకుంది.

590 Players to be IPL Auction on Feb 12-13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News