- Advertisement -
తొలి మ్యాచ్‌లో ఆసీస్‌తో భారత్ ఢీ
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ ఏడాది జులై 28 నుంచి జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు చోటు దక్కింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో మళ్లీ క్రికెట్‌కు స్థానం లభించడం విశేషం. టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈసారి కేవలం మహిళలకు మాత్రమే పోటీలు నిర్వమిస్తారు. ఆస్ట్రేలియా, బార్బడోస్, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాయి. ఇక భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జులై 29న జరిగే మ్యాచ్‌తో క్రికెట్ పోటీలకు తెరలేస్తోంది. మరోవైపు ఈ గేమ్స్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
- Advertisement -