- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గచ్చిబౌలి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు సాయికుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాధిక శరత్ కుమార్, సాయి కుమార్ మాట్లాడుతూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యమై మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Radhika and Sai Kumar plant saplings
- Advertisement -