Monday, December 23, 2024

రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
No early elections in Telangana Says CM KCR
గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి
95 నుంచి 105 సీట్లతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటాం: సిఎం కెసిఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తూ ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజల సంతోషంతో ఉన్నారన్నారు. తమ పాలన పాట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తూ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. కొందరు చిల్లర, మల్లరగాళ్లు చేస్తున్న ఉత్తుత్తి ప్రచారంగా ఆయన కొట్టేపారేశారు. అయితే వచ్చే ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల ముందుగానే చెబుతున్నా…రాసుకోండి…. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు 95 నుంచి 105 సీట్లు లభిస్తాయన్నారు. ఎన్నికల్లో ఎలా గెలువాలో తమ దగ్గర మంత్రం ఉందన్నారు. అయితే ఆరు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. 2018లో ప్రత్యేక పరిస్థితుల కారణంగానే ఆరు నెలల గడువుకుంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని సిఎం కెసిఆర్ అన్నారు. అయితే 2014లో టిఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే తదనంతరం జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు దక్కాయన్నారు. ఇది తెలంగాణ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి నిదర్శమన్నారు. ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కూడా పునరావృతం కాబోతున్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News