- Advertisement -
విజయవాడ: ఎపిలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలంలో ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రావులపాలెం కన్యకా పరమేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని కన్యకా పరమేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న కన్నెవీడు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి బాణావతి ఆకాష్ గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Engineering Student Suspicious died in AP
- Advertisement -