- Advertisement -
న్యూయార్క్/జెనీవా: అమెరికా రాష్ట్రం అంతటా దాదాపు 769 కిమీ. దూరం వరకు విస్తరించిన మెరుపును 2020లో ప్రపంచ వాతావరణ సంస్థ రికార్డు చేసింది. ఇదే అత్యధిక సింగిల్ ఫ్లాషగా ప్రకటించింది. దీనీ దూరం లండన్ నుంచి జర్మనీలోని హాంబర్గ్ నగరం వరకు విస్తరించిన దూరం ఉంటుందని పేర్కొంది. ఈ మెరుపు అమెరికాలోని మిసిసిపి, లూసియానా మొదలుకుని దక్షిణాన ఉన్న టెక్సాస్ వరకు విస్తరించినట్లు నమోదుచేశారు. దాని పొడవు వాస్తవంలో 768 కిమీ. లేక 477.2 మైళ్లుగా నమోదయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ సంస్థ మంగళవారం తెలిపింది.
- Advertisement -