Monday, December 23, 2024

నాలుగో ర్యాంక్‌లో రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul is ranked fourth in ICC rankings

ఐసిసి టి20 ర్యాంకింగ్స్

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న రాహుల్ ఈసారి ఒక స్థానాన్ని మెరుగు పరుచుకుని నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. రాహుల్ 729 రేటింగ్ పాయింట్లతో ఈ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి తన పదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 11వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 805 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌కే చెందిన మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్‌క్రామ్ మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్) ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), డెవోన్ కాన్వే (కివీస్), వండర్ డుసెన్ (సౌతాఫ్రికా), మార్టిన్ గుప్టిల్ (కివీస్)లు వరుసగా తర్వాతి ర్యాంక్‌లలో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో వనిండు హసరంగా (శ్రీలంక) 797 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. తబ్రేజ్ షంసి (సౌతాఫ్రికా) రెండో, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) మూడో ర్యాంక్‌లో నిలిచారు. ఇక భారత్ నుంచి ఎవరూ కూడా టాప్10లో చోటు సంపాదించలేదు. అంతేగాక ఆల్‌రౌండర్ల విభాగంలో కూడా టీమిండియా క్రికెటర్లకు టాప్10లో స్థానం దక్కలేదు. అఫ్గాన్ స్టార్ మహ్మద్ నబి 265 పాయింట్లతో ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్ ) రెండో, మోయిన్ అలీ (ఇంగ్లండ్) మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News