Monday, December 23, 2024

భారత్ నిర్మించిన ఐదో స్కార్పియన్ క్లాస్

- Advertisement -
- Advertisement -
fifth Scorpene class built by India
జలాంతర్గామి తొలి సముద్రయానం!

న్యూఢిల్లీ: భారత నావికాదళం సరికొత్త జలాంతర్గామి మంగళవారం తొలిసారి సముద్రయానం చేసింది. ఫ్రెంచ్ నిర్మించిన స్కార్పియన్ క్లాస్ ఆరు జలాంతర్గాములలో ఇది ఐదోవది. ఈ జలంతర్గామని కఠినంగా పరీక్షించాక ఈ ఏడాది చివర్లో దీనిని నావికాదళానికి అందజేస్తారు. మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండిఎల్) నిర్మాణం చేపట్టిన సమయంలో ఈ జలాంతర్గామికి ‘యార్డ్ 11879’ అని పేరుపెట్టారు. అయితే ఇది నావికాదళంలోకి ప్రవేశపెట్టాక దీని పేరును ‘వాగిర్’ అని నామకరణం చేయనున్నారు.

“కరోనావైరస్ మహమ్మారి కాలంలో సైతం గత ఏడాది ప్రాజెక్ట్ 75కు రెండు జలాంతర్గాములను ఎండిఎల్ అందించింది”అని నావికాదళం తన ప్రకటనలో పేర్కొంది. ‘ఈ ఐదవ జలాంతర్గామి సముద్ర పరీక్షలు ఓ ముఖ్యమైన మైలురాయి’ అని కూడా నావికాదళం తెలిపింది. ఈ జలాంతర్గామి నిర్మాణం 2009 జులైలో ఆరంభించారు. దీనికి ‘సుపీరియర్ స్టెల్త్ ముఖ్యాంశాలు’ ఉన్నాయి. అంటే అడ్వాన్స్‌డ్ అకోస్టిక్ అబసర్బషన్ టెక్నిక్ ను కూడా జోడించారు. ఈ టెక్నిక్‌ను 2020 నవంబర్‌లోనే ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ జలాంతర్గామి విస్తృత సిస్టం, మెషినరీ, ఆయుధాల పరీక్షలకు లోనుకానుంది. ఈ ఏడాది చివరికల్లా ఈ జలాంతర్గామిని నావికాదళంకు అప్పగించనున్నారు. ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్ వాగిర్ అన్న పేరు లభించింది. ఇది 1973 నుంచి 2001 వరకు పనిచేసిన రష్యా వేలా క్లాస్ జలాంతర్గామి నుంచి ఈ పేరును పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News