- Advertisement -
న్యూఢిల్లీ: నిరుపయోగం ఉన్న 50 లక్షల కొవిషీల్డ్ డోసులు ఈ నెలాఖరుకల్లా వృథా కానున్నాయని పేర్కొన్న మీడియా రిపోర్టులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఖండించింది. ఇదిలావుండగా కొవిడ్19కి సంబంధించిన వ్యాక్సినేషన్ల వివరాలను సమీక్షించాల్సిందిగా కేంద్ర అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. వ్యాక్సినేషన్లు వీలయినంత తక్కువ మేరకు వృథా అయ్యేలా చూడాలని కూడా సలహా ఇచ్చింది. వ్యాక్సిన్ డోసులు కాలాతీతం అయి వృథా కాకుండా చూడాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ప్రభుత్వ వెబ్‌పోర్టల్ ‘కోవిన్’లో వ్యాక్సినేషన్ల వివరాలు పొందుపరిచారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ కొవిడ్ వాక్సినేషన్ల కేంద్రాల వద్ద ఉన్న వ్యాక్సిన్లను ఉపయోగించుకోవాలని పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలతో చర్చలు కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది.
- Advertisement -