న్యూఢిల్లీ: తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఢిల్లీలోని నాగోలి ప్రాంతానికి చెందిన సచిన్ అనే వ్యక్తి.. తన తల్లిదండ్రులకు సానుకూలంగా కింది కోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో దానిని సవాల్ చేస్తూ.. ఢిల్లీ న్యాయస్థానాన్ని అశ్రయించాడు. తాము కష్టపడి సంపాదించి రెండు అంతస్థులు నిర్మించుకున్న ఇంటిని తమ కోడుకులు అక్రమించి.. తమను హింసిస్తున్నారని, ఇంటి విద్యుత్ చార్జీలు, పన్నులను సైతం కట్టకుండా వేదిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. తన ఇంటిలో ఉంటున్న తమ కొడుకులను తక్షణం తమ ఇల్లు ఖాళీ చేయించాల్సిందిగా కోరడంతో కిందికోర్టు తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీనిన హైకోర్టులో సవాల్ చేసిన కొడుకులకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని తీర్పును వెలువరించింది. దీంతో తల్లిదండ్రుల అనుమతి, దయతో మాత్రమే కోడుకులు ఇంట్లో వుండే అవకాశం వుంది. అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో బిడ్డలు ఉండవచ్చని, అలాగని కొడుకులను జీవితాంతం భరించాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ ప్రతిభా రాణి తీర్పును వెలువరించారు. ఇక స్వార్జితంతో సంపాదించిన ఇల్లయితే… కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస కూడా అవసరం లేదని తెలిపారు.
No Legal Right to sons live in Parents house: Delhi HC