Friday, November 15, 2024

పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రమాణం..

- Advertisement -
- Advertisement -

పణాజీ: ఎన్నికల్లో గెలిచాక తాము వేరే పార్టీలోకి ఫిరాయించబోమంటూ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ప్రమాణం చేశారు. గతంలో పార్టీ ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ గోవాలో భారీగా నష్టపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అభ్యర్థులు తాము వేరే పార్టీలోకి ఫిరాయించబోమంటూ గుడి, మసీదు, చర్చిలో ప్రమాణం చేసిన అనంతరం తమ నాయకుడు రాహుల్ ముందు ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి సంకల్ప్ అమోంకర్ తెలిపారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 17 స్థానాలను గెలుచుకుంది. అయితే, 13 స్థానాలను మాత్రమే గెలుచుకున్న బిజెపి చిన్న పార్టీలు, స్వతంత్రుల సహయాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపిలోకి ఫిరాయించగా అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు బాబు కావ్లేకర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇలా ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ అభ్యర్థుల చేత పార్టీ ఫిరాయింపు నిరోధక అఫిడవిట్లపై సంతకాలు చేయించుకుంది.

Goa Congress Candidates take pledge against defection

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News