మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసి అన్ని ఏర్పాట్లు
ఇప్పటివరకు 5వందల బస్సులు…
12వందల ప్రయాణికుల చేరవేత
సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలి
మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ అందుబాటులోకి: ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసి అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఇప్పటివరకు 5వందల బస్సులు 12వందల ప్రయాణికులను మేడారం చేర్చామని సజ్జనార్ వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలని ఆయన ప్రయాణికులకు సూచించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఆర్టీసి చరిత్రలోనే మొదటిసారి ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందన్నారు. మొదట రెండెంకల బస్సులతో 1970లో స్టార్ట్ అయ్యిందని, ప్రస్తుతం 7వందలకు పెరిగిందన్నారు. గతేడాది 19లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామన్నారు. గతేడాది 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్స్ రన్ చేశామన్నారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని సజ్జనార్ తెలిపారు. గతేడాది 30 కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. ఈ సారి 3,845 బస్సులు నడపాలని- 51 పాయింట్స్ నుంచి మేడారానికి ఆర్టీసి బస్సులు నడుస్తాయన్నారు. ఇతర రాష్ట్రాలు మహారాష్ట్రతో పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతున్నామన్నారు.
30మంది ప్రయాణికులు ఉంటే కాల్ 040 30102829
30మంది ప్రయాణికులు ఉంటే ఈ నంబర్ 040 30102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ప్రజలందరూ తమ వెబ్ సైట్‌లను చూస్తే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి జాతర రద్దీ స్టార్ట్ అవుతుందని, 12వేల మంది సిబ్బంది జాతర విధుల్లో తమ సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 8 రోజుల పాటు ఆర్టీసి అధికారులు మేడారంలో ఉంటారని, 50 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఆర్టీసి ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. ఆర్టీసి ఆధ్వర్యంలో 3 వందల మంది ప్రత్యేకంగా వాలంటర్స్ గ్రౌండ్‌లో ఉంటారని, వరంగల్ నుంచి 2వేలకు పైగా బస్సులు నడుపుతున్నామని ఎండి తెలిపారు. స్పెషల్ బస్సులన్నీ కండక్టర్ లెస్ బస్సులుగా నడుపుతున్నామన్నారు. ప్రైవేటు పార్కింగ్ స్థలం నుంచి 30 షెటిల్ బస్సులు నడుస్తాయని, 11 మొబైల్ మెకానికల్ టీమ్స్ మేడారం రూట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్టీసి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సిసి టివి కెమెరాలు అందుబాటులో ఉంచామని ఆర్టీసి ఆధ్వర్యంలో నిఘా ఉంటుందని ఆయన తెలిపారు. బస్సులు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసి ఆధ్వర్యంలో రెండు కళా బృందాలను సైతం ఏర్పాటు చేశామని ఎండి తెలిపారు.
TSRTC Run special Buses to Medaram Jatara