- Advertisement -
భారీగా నష్టపోయిన ఫేస్‌బుక్ స్టాక్
న్యూయార్క్ : ఫేస్‌బుక్ యజమాన్య సంస్థ మెటా స్టాక్స్ గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజే కంపెనీ విలువ రూ.14,94,040 కోట్లు ఆవిరైంది. ఈ షేరు పతనం స్టాక్‌మార్కెట్ చరిత్రలో అత్యంత ఘోరమైన ఒక రోజు క్రాష్‌గా పేర్కొంటున్నారు. పేలవమైన ఫలితాల కారణంగా అమెరికా ట్రేడింగ్‌లో ఫేస్‌బుక్ షేర్లు 24 శాతం క్రాష్ అయ్యాయి, దీని వలన కంపెనీ విలువ 200 బిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. అంటే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ విలువ 220 బిలియన్ డాలర్లు, టాటా గ్రూప్ టాటా కన్సల్టెన్సీ (టిసిఎస్) విలువ 170 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఈ నష్టం ఉందన్న మాట. ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ కారణంగా ఫేస్‌బుక్‌పై ప్రభావం ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టిక్‌టాక్ వంటి ప్రత్యర్థిక సంస్థల నుంచి మెటాకు తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు.
- Advertisement -