Saturday, March 29, 2025

ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi Unveiled ICRISAT Logo

హైదరాబాద్: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అందులో భాగంగానే ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్ ను ప్రధాని శనివారం ఆవిష్కరించారు. పటాన్‌చెరులో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్ ) 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని అభినందనలు తెలిపారు. 50ఏళ్లుగా ఇక్రిశాట్ చేస్తున్న పరిశోధనలకు ప్రధాని అభినందనలు చెప్పారు. వచ్చే యాభై ఏళ్లు మరిన్ని పరిశోధనలు జరపాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంటల దిగుబడి గణనీయంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేయాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News