Monday, December 23, 2024

యూపీలో ఒవైసీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi denied permission to public meeting

లక్నో : యూపీ లోని లోని పట్ణణంలో శనివారం జరగాల్సిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో సభ రద్దు అయింది. ముందుగా అనుకున్న ప్రకారం ఛప్రౌలీ పట్టణంలో జరిగే మరో బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగించనున్నారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరణతో కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. ఒవైసీ ప్రయాణిస్తున్న కారుపై గురువారం కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ నిందితుడికి పిస్టల్ మీరట్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతన్ని అదుపు లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మీరట్ నగరంలో ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద సచిన్, శుభంలో సమీపం నుంచి కాల్పులు జరిపారు. నోయిడా నివాసి సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News