Saturday, November 23, 2024

ప్రధాని ప్రైవేట్ రాకకు సిఎం స్వాగతం అక్కర్లేదు

- Advertisement -
- Advertisement -

Chief Minister does not need to welcome Prime Minister personal visit

ప్రభుత్వేతర సంస్థల కార్యక్రమాలు ప్రైవేట్ కేటగిరీలోకి వస్తాయి
వాటి కార్యక్రమాలను ప్రధాని సందర్శించేటప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా స్వాగతించాల్సిన అవసరం లేదు : రాష్ట్ర అధికారులు
సిఎం అస్వస్థతకు గురయ్యారు
బిజెపి నేతల ప్రేలాపనలు సిగ్గుచేటు
టిఆర్‌ఎస్ నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వేతర సంస్థల నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని సందర్శన.. ప్రైవేటు కేటగిరిలోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో శనివారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్, ముచ్చింతల్‌లోని సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవాలు జరిగాయి. రాష్ట్రంలో ప్రధానమంత్రి సందర్శన ప్రైవేట్ కేటగిరిలోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్ సందర్శనలో ప్రధానిని ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా స్వాగతించాల్సిన అవసరం లేదని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారం ధృవీకరించినట్లు వెల్లడించారు. వ్యక్తిగత పర్యటనలో ప్రధానమంత్రి హాజరు కాగా సిఎం అస్వస్థతకు గురైన దృష్టా హాజరు కాలేకపోయారని అధికారులు వెల్లడించారు.

బిజెపి నాయకులవి రాజకీయ దురుద్దేశ వ్యాఖ్యలు…

సిఎం అస్వస్థతకు గురికాగా.. రాష్ట్ర బిజెపి నాయకులు సిఎంకు వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటని టిఆర్‌ఎస్ నేతలు అన్నారు. అన్నింటినీ రాజకీయ సమస్యగా మార్చాలనే వారి దురుద్దేశాన్ని రుజువు చేస్తుందన్నారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే వ్యూహాన్ని తెలంగాణ బిజెపి నాయకులు ఆపాలని వారు సూచించారు. ప్రైవేట్ కార్యక్రమాల్లో ప్రధాని మోడీ వ్యక్తిగత సందర్శనకు ముఖ్యమంత్రి స్వాగతం పలకాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం జారీ చేసిన ప్రోటోకాల్ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించిందని వారు గుర్తుచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News