Monday, December 23, 2024

రెండు బైక్ లు ఢీ: ఇద్దరు దర్మరణం..

- Advertisement -
- Advertisement -

2 Died in Road Accident in Kurnool

కర్నూల్: జిల్లాలోని నందికొట్కూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం నందికొట్కూరులో వేగంగా దూసుకొచ్చిన రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను వడ్డేమాను గ్రామానికి చెందిన సోమశేఖర్, నాగరాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

2 Died in Road Accident in Kurnool

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News