Monday, December 23, 2024

వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేయాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao Telli Conference with District health authorities

హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం అన్ని జిల్లాల డిఎంహెచ్ఒలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, సిహెచ్ఒలు, పిహెచ్ సి డాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా పరిస్థితులు, వాక్సినేషన్, జ్వర సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.సుధీర, కరోనా నోడల్ ఆఫీసర్ డా. బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఫీవర్ సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించగలు గుతున్నాము. సర్వేలో భాగస్వామ్యం అయిన అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి పైగా ఇండ్లు కవర్ చేశాం. అన్ని జిల్లాల్లో దాదాపు మొదటి రౌండ్ పూర్తి అయ్యింది. రెండో రౌండ్ ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. కోవిడ్ ఓపీ కొనసాగించడంతో పాటు ఏవైనా మండలాలు, ఇతర ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల గుర్తిస్తే అవసరాన్ని బట్టి రెండో, మూడో ఫీవర్ సర్వేలను కొనసాగించాలి. వ్యాక్సినేషన్ అన్ని కేటగిరీల్లో వంద శాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. తక్కువ ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. 18 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు, 60 ఏళ్లకు పైబడి కోమార్బిడ్స్ ఉన్నవారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రికాషన్ డోసు, 15-17 మధ్య వయసు వారికి రెండు డోసులు అన్ని జిల్లాలో 100శాతం పూర్తి కావాలి. వ్యాక్సిన్ వేగవంతం చేయాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. 18 ఏళ్లకు పైబడిన వారికి 31 జిల్లాల్లో 100 శాతం టీకాలు వేశారు. నిజామాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ కూడా పూర్తి చేస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్లో 100శాతం లక్ష్యం పూర్తవుతుంది. కరోనా వైద్య సేవలు అందించడంతో పాటు సాధారణ వైద్య సేవలు, ఎన్ సీడీ స్క్రీనింగ్, ఆరోగ్య పరీక్షలన్నీటి డయాగ్నస్టిక్ కేంద్రాలలో చేయడం, ఇతర ఆరోగ్య కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించాలి” అని పలు సూచనలు చేశారు.

హనుమకొండ, కరీంనగర్ కు ప్రత్యేక అభినందనలు..
18 ఏళ్లకు పైబడిన వారికి రెండు డోసులు పూర్తి చేసిన కరీంనగర్, హనుమకొండ జిల్లాలను, 15-17 ఏళ్ల కేటగిరీలో 100 శాతం పూర్తి చేసి మొదటి జిల్లాగా నిలిచినందుకు హన్మకొండ జిల్లాలను మంత్రి అభినందించారు. అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర జిల్లాలు ఈ రెండు జిల్లాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

Harish Rao Telli Conference with District health authorities

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News