హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివని రాష్ట్రపతి అన్నారు. ”లతా మంగేష్కర్ తన గానంతో విభిన్న భావోద్వేగాలు పలికించారు. దశాబ్దాల భారతీయ సినిమా పరిమాణాన్ని చూశారు. భారత దేశ అభివృద్ధిని లతా జీ ఆకాంక్షించారు. అభివృద్ధి చెందిన భారత్ ను ఆమె కోరుకున్నారు” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు లతా మంగేష్కర్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపుతున్నారు. కాగా, లతా మంగేష్కర్ 1942లో తన 13వ ఏట తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. వివిధ భారతీయ భాషలలో ఆమె ఇప్పటివరకు 30 వేలకు పైగా పాటలు పాడారు. గానకోకిలగా పేరుగాంచిన లతను భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతోపాటు పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించాయి.
PM Modi Condoles Lata Mangeshkar’s demise