- Advertisement -
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల కమిషన్ సవరించింది. సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీ తోనూ ఆరుబయలు మైదానాల్లో 30 శాతం సామర్థం తోనూ బహిరంగ సభలను నిర్వహించవచ్చని తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి తోనూ, ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ శనివారం చర్చించి , ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కొవిడ్ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడిందని, పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని, ఈ రోగులు ఆస్పత్రిలో చేరవలసిన అవసరం కూడా తగ్గిందని అధికారులు చెప్పినట్టు తెలియజేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక పరిశీలకుల్లో అత్యధికులు ఈ ఆంక్షలను సడలించాలని సిఫారసు చేసినట్టు తెలిపింది.
- Advertisement -