Saturday, November 23, 2024

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -
Northzone Task Force police raid gaming house
పేకాడుతున్న ఎనిమిది మంది అరెస్టు
రూ.1,60,400 నగదు, క్యాసినో కాయిన్స్ స్వాధీనం

హైదరాబాద్: గేమింగ్ హౌస్‌పై దాడి చేసిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వాహకుడితోపాటు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,60,400 నగదు, క్యాసినో కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని బేగంబజార్‌కు చెందిన ఘనశ్యాం దాస్ కర్వా వ్యాపారం చేస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారితో గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. బేగంబజార్‌కు చెందిన దయారాం, పంకజ్ కుమార్, జయ్‌ప్రకాష్ చిత్తంగి, కమలా సోని, జితెందర్ బంగాడ్, శ్యాంసుందర్, కృష్ణ బుంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన ఘనశ్యాం దాస్ మూడు పత్తాల ఆటతో గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. పంటర్ల సాయంతో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిని ఆహ్వానిస్తున్నాడు. గేమింగ్‌లో డబ్బులకు బదులుగా క్యాసినోల్లో వాడే కాయిన్స్‌ను ఉపయోగించి గేమింగ్ నిర్వహిస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు దాడి చేసి ఆర్గనైజర్, ఆడుతున్న వారిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, అశోక్ రెడ్డి, అనంత చారి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News