Monday, December 23, 2024

విదేశాల్లో విద్యాభ్యాసానికి యువతకు చేయూత

- Advertisement -
- Advertisement -

షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Youth study abroad

మనతెలంగాణ/ హైదరాబాద్:  ఓవర్సీస్ స్కాలర్ షిప్పుల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో ఎస్సీల సంక్షేమం, అభ్యున్నతికి అమలవుతున్న పథకాలపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నివర్గాల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.ఈ పథకం ద్వారా విదేశాలలో విద్యనభ్యసించాలనే ఆసక్తి కలిగిన యువతకు రూ.20 లక్షలు ఉచితంగా అందజేస్తున్నామని వెల్లించారు. ఇందు కోసం చేసుకున్న దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలలో సదుపాయాలు మరింత మెరుగు పర్చాలని సూచించారు. హాస్టళ్లలో సౌరశక్తిని ఉపయోగించి వాటర్ హీటర్లు,కోల్ స్టోరేజ్ లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. పోటీ పరీక్షలకు సంసిద్ధులయ్యే విద్యార్థుల కోసం రాష్ట్రంలో 12 స్టడీ సర్కిల్స్ ఉన్నాయని వెల్లడించారు.అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్, కమిషనర్ యోగితారాణా, ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్ రాస్, కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు

ఎస్సీ గురుకుల క్యాలెండర్ ఆవిష్కరణ..
ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల సంఘం క్యాలెండర్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బాల్‌రాజు,ప్రధానకార్యదర్శి నూనె దయాకర్, నాయకులు రాములు, రవీందర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News