Monday, December 23, 2024

మూడో వేవ్ పూర్తిగా ముగిసినట్లే: డిహెచ్.శ్రీనివాస రావు

- Advertisement -
- Advertisement -

Corona 3rd wave decrease in Telangana: DH Srinivasa Rao

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ పూర్తిగా ముగిసినట్లేనని ప్రజా ఆరోగ్య సంచాలకులు శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో డిహెచ్ మాట్టాడుతూ.. ”తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.జనవరి 28న 3వ వేవ్ పీక్ వచ్చింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2కంటే తక్కువ. 4శాతం ఆస్పత్రి బెడ్స్ ఫిల్ అయ్యాయి. మూడో వేవ్ పూర్తిగా ముగిసిందని చెప్పొచ్చు. మొదటి వేవ్ దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డాము. రెండో వేవ్ దాదాపు 6 నెలలు ఉంది.మూడో వేవ్ 28 రోజుల్లోనే పీక్ నెంబర్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ని సమర్ధంగా ఎదుర్కొంది. ఫీవర్ సర్వే సత్ఫలితాలు ఇచ్చాయి. కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసింది. మూడో వేవ్ కేవలం 2 నెలల్లోనే అదుపులోకి వచ్చింది. మూడో వేవ్ లో టీకా తీసుకొని వారు 2.8% మంది ఆస్పత్రిపాలు అయ్యారు. మూడో వేవ్ లో 31లక్షల నిర్ధారణ పరీక్షలు చేశాం. జనవరి 25న అత్యధికంగా 4800 కేసులు నమోదయ్యాయి. మూడో వేవ్ లో కేవలం 3000 మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు. మూడో వేవ్ ఫీవర్ సర్వే లో 4 లక్షల మందికి కిట్ లు ఇవ్వడం జరిగింది. కోవిడ్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు. అన్ని సంస్థలు 100శాతం పని చేయొచ్చు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకి రావచ్చు. ఐటి ఇండస్ట్రీ సైతం వర్క్ ఫ్రొం హోమ్ తీసివేయవచ్చు. వర్క్ ఫ్రొం హోమ్ ని విరమించాలని కోరుతున్నాము. విద్య సంస్థలు పూర్తిగా ప్రారంభించాము. పిల్లలలో ఆన్ లైన్ తరగతులతో మానసిక సమస్యలు వస్తాయి. కేసులు తగ్గినా మాస్క్ లు ధరించాలి. అందరూ టీకా తీసుకోవాలి” అని చెప్పారు.

Corona 3rd wave decrease in Telangana: DH Srinivasa Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News