Monday, December 23, 2024

గులాబీమయంగా మారిన ‘పట్నం’

- Advertisement -
- Advertisement -

Minister KTR to launch development works

 

మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ గులాబీమయంగా మారింది. బుదవారం ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్‌ల లో సుమారు రూ.260 కోట్ల అభివృద్ధ్ది పనులను ప్రారంభించడానికి ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ , మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేములు ప్రశాంత్‌రెడ్డిలు వస్తున్న సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలో సభ ఏర్పాట్లతో పాటు రోడ్లన్నీ గులాబీమయంగా మారా యి. ముఖ్యంగా తెరాస కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఫెక్లీలను ఏర్పాటు చేసి రోడ్ల కిరువైపుల గులా బీమయం చేశారు. అంతేకాకుండా అవుటర్‌రింగ్ రోడ్డు నుండి మొదలు కొని ఆదిభట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కటౌట్లను ఏర్పాటు చేశారు. కటౌట్లలో ప్రధానంగా ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కెటిఆర్ ఫొటో లు ప్రధానంగా ఆకర్శిస్తున్నాయి. హోటలలో, బస్టాండ్‌లో ఎక్కడ నలుగురు కూడిన గులాబీమయం కావడంతో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ఇంతకీ వచ్చే ఎన్నికలలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డికా టికెట్ ఆయ న తనయుడుకా టికెట్ అంటూ చర్చించికోవడం విశేషం.

భారీ ఎత్తున జనసమీకరణ: ప్రశాంత్‌రెడ్డి

గతంలో కన్న భిన్నంగా రేపు జరుగబోయే కెటిఆర్ బహిరంగ సభకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన ఉందని భారీ ఎత్తున జనసమీకరణకు తమ పార్టీ శ్రేణులు మండలంలోనే కాకుండా మూడు మున్సిపాలిటీలలో సుమారు 10 వేల మందితో సభను నిర్వహిస్తామని నాయకులు మం చిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా ఈ మధ్యనే కిషన్‌రెడ్డి నాయకత్వంలో అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయితీల కార్యాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. అదె స్ఫూర్తితో జన సమీకరణ చేస్తామని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News