Monday, December 23, 2024

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు

- Advertisement -
- Advertisement -

TRS MPs fires over Modi's remarks on formation of Telangana

 

హైదరాబాద్ : ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ నగరంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రి గంగుల కమలాకర్ నిరసన తెలిపారు. నిన్న పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తక్షణం తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావస్తున్నప్పటికి బిజెపి ప్రభుత్వానికి తెలంగాణపై విషం చిమ్మడం, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం సరి కాదంటూ మండిపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News